HNK: హనుమకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ -2 డిపో మేనేజర్ రవి చందర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి స్పెషల్ సర్వీస్లు ప్రారంభమవుతాయని, ప్రయాణికుల రద్దీని బట్టి పెంచుతామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులో వెళ్తే సమ్మక్క, సారక్క గద్దెల వరకు చేరుకోవచ్చన్నారు.