GNTR: రెడ్డిపాలెం రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు (50) అతని శరీరంపై బిస్కెట్ కలరు గళ్ల చొక్కా, మెరూన్ కలర్ లుంగీ ఉన్నట్లు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొన్న SI సుభాని మృతదేహాన్ని పరిశీలించి జిల్లా గవర్నమెంట్ హాస్పటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.