HYD: న్యూ ఇయర్ రోజు ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక MMTS రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జాము వరకు లింగంపల్లి-నాంపల్లి మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ రైళ్లు చందానగర్, హఫీజ్‌పేట్, భరత్‌నగర్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ తదితర స్టేషన్లలో ఆగుతాయి.