KRNL: 104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఉద్యోగుల బృందం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది. తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని కోరగా, సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.