జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం దక్షిణ కశ్మీర్, జమ్మూలో వేట కొనసాగుతోంది. ఉగ్రవాది లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. అనంత్‌నాగ్ ప్రాంతంలో లతీఫ్ భట్ కదలికలను సీసీటీవీ కెమెరా ద్వారా గుర్తించారు. కశ్మీర్ రివల్యూషనరీ ఆర్మీ ఉగ్రవాద గ్రూపులో లతీఫ్ కీలక నేతగా ఉన్నాడు. దీంతో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టి వెతుకుతున్నారు.