యూపీకి చెందిన ఇస్లాం మతబోధకుడు శంసుల్ హుదా ఖాన్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. పాక్‌కు చెందిన ఓ ఉగ్ర సంస్థతో సహా తీవ్రవాద ముఠాలతో సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు. 2013లో బ్రిటన్ వెళ్లిన శంసూల్.. మదర్సాలో విధులు నిర్వహించకపోయినా 2013-17 మధ్య జీతం తీసుకున్నారని చెప్పారు. అతను రూ.30 కోట్ల విలువైన స్థిరాస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.