AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గిరిజన మహిళను అర్ధరాత్రి స్టేషన్లో ఉంచారు. దీంతో ఎక్సైజ్ స్టేషన్ దగ్గర గిరిజనులు ఆందోళనకు దిగారు. కావాలనే అధికారులు సారా కేసు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆందోళనతో ఎక్సైజ్ సిబ్బంది మహిళను విడిచిపెట్టినట్లు సమాచారం.