గుంటూరు: నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇవాళ కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవ్వాలని కమిషనర్ పిలుపునిచ్చారు.