PLD: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. 31న పింఛన్ పొందలేని మిగిలిన లబ్ధిదారులకు జనవరి 2వ తేదీన పింఛన్లను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.