NLG: మునుగోడు క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 4న ఉదయం 9 గంటల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు ఆధార్ కార్డుతో హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు. కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమైన వారికి హైదరాబాద్లో ఉచితంగా చికిత్స చేయిస్తారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.