AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నిధులు విడుదలయ్యాయి. స్త్రీశక్తి పథకానికి రూ.800 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ నుంచి మార్చి వరకు నెలకు రూ.160 కోట్ల చొప్పున 5 నెలలకు ముందస్తుగా స్త్రీశక్తి అమలుకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే.