కృష్ణా: ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అవనిగడ్డ RTC డిపో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. డిపో మేనేజర్ హనుమంతరావు శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహించనున్నారు. ఈ సమయంలో డిపో పరిధిలోని ప్రయాణికులు బస్సుల టైమింగులు, సౌకర్యాలు, మార్గాలపై అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చు. ఇందుకోసం 9959225466 నంబరుకు సంప్రదించాలన్నారు