NRML: బాసర ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదువుతున్న విద్యార్థి సాయికిరణ్ జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించనున్న ‘నేషనల్ యూత్ ఫెస్టివల్లో పాల్గొననున్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్ – మేక్ ఇన్ ఇండియా’ అనే అంశంపై సాయికిరణ్ తన ప్రతిభను చాటనున్నారు.