రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం.హరిత బదిలీ అయ్యారు. చాలారోజులుగా సెలవులో ఉన్న ఆమెను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దివారాలుగా జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌ను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ కొనసాగాలన్నారు.