SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దత్తత దేవాలయమైన శ్రీ నాంపల్లి లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించగా రూ.15,47,828 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి 9 నెలల కాలంలో వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు పేర్కొన్నారు.