PDPL: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను నిరుద్యోగ యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం-3 ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూట్ బ్యాగ్ తయారీ వంటి శిక్షణలతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.