KNR: గ్రామీణ క్రీడాకారులను ఒలింపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, జమ్మికుంటలో రూ. 6.5 కోట్లతో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తన చొరవతో ‘ఖేలో ఇండియా’ పథకం కింద ఈ నిధులు మంజూరయ్యాయని, ఉత్తర తెలంగాణ యువతకు ఇది వరం కానుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.