నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీసులు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ ప్రాంతం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న సమయంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.