SKLM: జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన యూరియాను తగినంతగా అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 రబీలో అన్ని రకాల పంటలకు గాను మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఎరువుల డీలర్లు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు.