నెల్లూరు: వరి పంట పొలాలకు తగిన మోతాదులోనే ఎరువులు వేయాలని విడవలూరు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ తెలియజేశారు. బుధవారం మండలంలోని ఊటుకూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.