VZM: ఎం-కేడ్ పథకం ద్వారా పెద్దగెడ్డ ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.78.2 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా 60:40గా ఉండనుందన్నారు. ప్రాజెక్టు ద్వారా 7,567 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని, భూగర్భ పైప్లైన్లు, సెన్సార్లు, జీపీఎస్ సాయంతో ఆధునికంగా నీటి పంపిణీ చేపడతామన్నారు.