TG: HYD HCUలో AI కాపీయింగ్ బయటపడింది. నాన్ టీచింగ్ సిబ్బంది కోసం నిర్వహించిన పరీక్షల్లో కొంతమంది కాపీయింగ్ చేశారు. షర్ట్ బటన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి స్కాన్ చేశారు. ఆ ప్రశ్నలను బాత్రూంకు వెళ్లి AIలో సెర్చ్ చేసి రాశారు. బ్లూటూత్ ద్వారా కూడా కాపీయింగ్‌కు పాల్పడ్డారు. బ్లూటూత్‌లో బీప్ సౌండ్ రావడంతో ఇన్విజిలేటర్ కనిపెట్టారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.