KNL: 50 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన టూ టౌన్ కానిస్టేబుల్ చిన్న సుంకన్నను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. విధులతో పాటు రక్తదానం వంటి సామాజిక సేవలో పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు.