ప్రకాశం: గిద్దలూరు మండలం కే.ఎస్ పల్లి గ్రామంలో మిరప పంటను ఉద్యాన శాఖ అధికారి శ్వేత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మిరప పంటలో తామర పురుగు, మిగతా రసం పీల్చే పురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. కొత్తగా నాటిన మిరపలో ఫ్రీ ప్రోనిల్ గుళికలను ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవడం వల్ల 45 రోజుల వరకు పంటలో తామర పురుగు నివారించవచ్చన్నారు.