WG: ఈనెల 5 నుంచి 15 వరకు విశాఖపట్టణంలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తణుకు మాంటిస్సోరి స్కూలు, కాలేజీ విద్యార్థులు అత్యధిక పతకాలు సాధించారు. ఈ మేరకు విద్యాసంస్థల డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు వివరాలు వెల్లడించారు. విజేతలైన విద్యార్థులను ఇవాళ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు.