KMM: అటవీ వనరుల పరిరక్షణ ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. జిల్లాలో చేపడుతున్న అటవీ అభివృద్ధి పనులపై జల సాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణతో చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు శాఖ తీసుకుంటున్న చర్యలను సత్యనారాయణ అభినందించారు. అనంతరం జిల్లాలోని అటవీ కార్యక్రమాల పురోగతిపై ఇరువురు పలు అంశాలను పంచుకున్నారు.