KRNL: వైసీపీని వీడి బీజేపీ లేదా జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఇవాళ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఎమ్మిగనూరులో ఆమె మాట్లాడుతూ.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఒకవేళ వైసీపీని వీడాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తాను, తన భర్త గానీ ఇప్పటివరకు నేరుగా కలవలేదన్నారు.