NLR: జిల్లాలో నుడాకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సరికొత్త ఆలోచనలతో, వినూత్నంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నుడా అధికారులకు సూచించారు. మంగళవారం నుడా కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన అథారిటీ సమావేశం జరిగింది. అజెండాలోని పలు అంశాలపై కమిటీ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.