ఒడిశా అటవీశాఖ రూ.7 కోట్లతో థార్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని మరో రూ.5 కోట్లు ఖర్చు చేసి మార్పులు చేసింది. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అటవీశాఖపై అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాహనాల కొనుగోలు, మార్పులకు అయిన ఖర్చులపై ఆడిట్ నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు బయటపడితే కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.