SRPT: నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం గ్రామంలో గొర్రెలు, మేకలలో నట్టల నిర్మూలన కార్యక్రమాన్ని సర్పంచి సరిత, ఉపసర్పంచి సైదమ్మ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జీవాలకు నట్టల మందులు తాగించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ బీ. అఖిల గోపాల మిత్రులు పాల్గొన్నారు.