NLG: ఉపాధి హామీ పేరు మార్పును ఉపసంహరించుకోవాలని వామపక్షాల నేతలు ఇవాళ నల్గొండలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం ఇటీవల పార్లమెంటులో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు.