ASR: రాజవొమ్మంగి మండలంలో త్వరలో మరో 9 రేషన్ డిపోలు ప్రారంభం కానున్నాయని తహశీల్దార్ అల్లు సత్యనారాయణ తెలిపారు. నూతన సేల్స్ మెన్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. చీడిపాలెం, చిన్నయపాలెం, గొబ్బిలమడుగు, కరుదేవిపాలెం, కె.మర్రిపాలెం, కె. వెలగలపాలెం, నెల్లిమెట్ల కాలనీ, తంటికొండ, రాజవొమ్మంగి-2 గ్రామాల్లో ఇప్పటికే రేషన్ డిపోలకు సేల్స్ మెన్లను నియమించామన్నారు.