MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి ఫిబ్రవరి 24 వరకు విద్యార్థుల కంటి పరీక్షలకు కార్యాచరణ చేపట్టింది. జిల్లాలో ఐదు బృందాలుగా ఆర్బీఎస్కే, కంటి వైద్యులు విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ చేపట్టారు. ఇబ్రహీంపూర్లో కంటి వైద్యులు వీర్ కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.