MNCL: జనవరి 5, 6, 7 తేదీలలో వరంగల్ పీడీఎస్‌యూ 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్ పిలుపునిచ్చారు. సోమవారం చెన్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహాసభల గోడ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు జరగనున్న మహాసభలలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.