AP: అనంతపురం శివారు ఆకుతోటపల్లి వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. విద్యుత్ నగర్లో రాత్రి రాజా అనే వ్యక్తిపై మద్యం మత్తులో నిందితుడు దేవరకొండ అజయ్ కత్తితో దాడి చేశాడు. రాజా ఫిర్యాదు మేరకు అజయ్ కోసం అనంతపురం టూటౌన్ CI శ్రీకాంత్ వెళ్లారు. ఈ క్రమంలో అజయ్ కత్తితో CIపై దాడికి దిగగా.. ఆయన నిందితుడి కాలిపై రివాల్వర్‌తో కాల్చాడు. అజయ్ దాడిలో CI చేతికి కత్తి గాయం అయింది.