NZB: మంగళ్పహాడ్ శివారులో గల హనుమాన్ మందిరంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అత్యంత విలువైన రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆదివారం సాయంత్రం పూజారి దీపారాధన కోసం వెళ్లగా గర్భాలయంలో విగ్రహాలు లేకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.