GNTR: తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం CI సాంబశివరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మసులుకోవాలని, ఎటువంటి నేరాల్లో పాల్గొన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతీ వారం జరిగే కౌన్సిలింగ్కు తప్పని సరిగా హాజరు కావాలని చెప్పారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండాలని ఆయన హెచ్చరించారు.