VZM: పదవి ఉన్న లేకపోయినా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఆదివారం వారి నివాసంలో అభిమానుల హర్షధానాల నడుమ, జై జగన్ అనే నినాదాల మధ్య కేక్ కటింగ్ చేశారు. జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరారు.