ADB: నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో 9వ వార్డును మండలంలోనే ఉన్నత వార్డుగా చేసి చూపిస్తామని నూతన వార్డు సభ్యుడు మడావి ఆనందరావు అన్నారు. ఆదివారం అంబెడ్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బౌద్ధ మహాసభ సభ్యులు ఆయన్ను ఘనంగా శాలువాతో సత్కరించారు. ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.