KMR: మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ ర్యాండమైజేషన్ కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా చీఫ్ పనింగ్ అధికారి రఘునందన్ , ఎస్వో శివకుమార్, పంచాయతీ అధికారి మురళి ఉన్నారు.