కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వెల్లడైన గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. మొత్తం 98 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 29 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 20 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండో దశ ఎన్నికల్లో భాగంగా గన్నేరువరం మండలంలోని పీచుపల్లి సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం అయింది.