BHPL: చిట్యాల మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాఫీగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగిస్తున్నారు. పట్టణం నుంచి గ్రామాలకు చేరుకున్న ఓటర్లు ఉత్సాహంగా ఓటేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది.