SKLM: కంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనం దొంగతనం కేసులో కంచిలికి చెందిన డొక్కరి రవికి సోంపేట మెజిస్ట్రేట్ కోర్టు 8 నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించినట్లు కంచిలి ఎస్సై పారినాయుడు శనివారం తెలిపారు. ఈ కేసుపై శనివారం న్యాయమూర్తి విచారణ చేపట్టగా, ప్రభుత్వ తరపున ఏపీపీ పీ. నరేష్ వాదనలు వినిపించినట్లు ఎస్సై తెలిపారు.