ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దొడ్డంపల్లి గ్రామంలో నవంబర్ 23న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన రమణారెడ్డి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.14 లక్షల ఆభరణాలను రికవరీ చేసినట్లు DSP నాగరాజు తెలిపారు.