EG: అమలాపురంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ద్వారా 667 అర్జీలు అందినట్లు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు.