కృష్ణా: గుడివాడలోని మల్లాయిపాలెం రైల్వే గేటు వద్ద ఎస్సై చంటిబాబు ఈరోజు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓవర్‌లోడెడ్ ప్రయాణికుల వాహనాలను ఆపి తనిఖీలు చేసి, ప్రయాణికులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.డ్రైవర్లను కౌన్సెలింగ్ ఇచ్చి,వారిపై అపరాధ రుసుములు విధించారు. ఇకపై వాహనాలను ఓవర్ లోడ్ చేస్తే వాహనాలను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.