KDP: బద్వేల్ టీడీపీ ఆఫీస్లో ఆ పార్టీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా ఆయన వినతులు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కృషి చేసేందుకే సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు.