TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 14న ఉ.7 గంటల నుంచి మ.1 వరకు పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే 415 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అటు ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే మద్యం షాపులను మూసివేశారు. అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లల్లో నిమగ్నమై ఉంది.