NLG: చిట్యాల మండలంలో తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన కాటం వెంకటేశం మండలంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థిగా నిలిచారు. గ్రామంలో 6 అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ 754 ఓట్ల ఆధిక్యంతో విజయం పొందారు. ఆ తర్వాతి స్థానంలో 681 ఓట్లతో వనిపాకల సర్పంచ్ కొండ్రెడ్డి మహిపాల్ రెడ్డి నిలిచారు.