ADB: ఆడెల్లి మహా పోచమ్మ ఆలయంలో ఈ నెల 17 తేదీ బుధవారం నాడు జంతుబలి పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ఇంఛార్జ్ EO భూమయ్య పేర్కొన్నారు. మహా పోచమ్మ పునఃప్రతిస్థాపన జరిగి 41 రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించినందుకు ఆలయం వద్ద మండల పూజ కార్యక్రమం నిర్వహించినందుకు గాను, ఆ ఒకే రోజు మాత్రమే జంతుబలి చేయకూడదని భక్తులకు విజ్ఞప్తి చేశారు.